రాబరీ కేసులో నలుగురు అరెస్టు… రూ.13.35 లక్షల విలువైన సొత్తు స్వాధీనం
సూర్యాపేట బ్యూరో, డైనమిక్ న్యూస్ మార్చి 14 ఆత్మకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రాబరీ కేసును సూర్యాపేట జిల్లా పోలీసులు ఛేదించారు. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేసి సుమారు రూ.13.35 లక్షల విలువైన బంగారం, వెండి, ఆటోలు తదితర సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ వెల్లడించారు. వృద్ధ మహిళలను లక్ష్యంగా చేసుకున్న ముఠా ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం కంచుకొమ్ముల సంతోష్, కంచుకొమ్ముల గణేష్, షేక్ నశ్రీన్, కంచుకొమ్ముల సాయికిరణ్ కలిసి ఒక ముఠాగా ఏర్పడి నేరాలకు పాల్పడుతున్నారు. ఆటోలను దొంగలించి వాటిలో ప్రయాణిస్తూ ఒంటరిగా...