రాజీవ్ నగర్ ఇళ్ల జాబితాపై వివాదంఅనర్హులకు చోటు.. అర్హులకు మొండిచేయి అంటూ ఆరోపణలు

డైనమిక్ న్యూస్, హుజూర్‌నగర్, మార్చి 14 హుజూర్‌నగర్ పట్టణంలోని ఫణిగిరి రామస్వామి గుట్ట వద్ద నిర్మించిన రాజీవ్ నగర్ సింగిల్ బెడ్‌రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికపై వివాదం చెలరేగింది. మంత్రి ఉత్తమ్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ ఇళ్లకు సంబంధించి అధికారులు శనివారం విడుదల చేసిన డ్రాఫ్ట్ జాబితాపై స్థానిక దరఖాస్తుదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏళ్ల తరబడి ఇళ్ల కోసం ఎదురుచూస్తున్న అర్హుల పేర్లు జాబితాలో లేకపోవడం అన్యాయమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లబ్ధిదారుల ఆగ్రహం జాబితాలో అనర్హులకు ప్రాధాన్యం కల్పించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సొంతంగా భూములు, ప్లాట్లు ఉన్నవారికి కూడా ఇళ్లు కేటాయించారని ప్రచారం జరుగుతుండగా, నిజంగా ఇళ్లు లేని...