రేపటి నుండి పదో తరగతి పరీక్షలు నేరేడు చర్ల మండలంలో 4 పరీక్షా కేంద్రాలు – 676 మంది విద్యార్థులు హాజరు
నేరేడుచర్ల, డైనమిక్ న్యూస్, మార్చి 13 తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా శనివారం నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి వార్షిక పరీక్షల కోసం నేరేడు చర్ల మండలంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు శుక్రవారం మండల విద్యాశాఖ అధికారి బాలు నాయక్ తెలిపారు. మండలంలోని నాలుగు పరీక్షా కేంద్రాల్లో మొత్తం 676 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు వెల్లడించారు. నాలుగు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు మండలంలో శ్రీవాణి హైస్కూల్ 160, ప్రగతి హైస్కూల్180, శ్రీచైతన్య హైస్కూల్146, జెడ్పీ హైస్కూల్ 190ను పరీక్షా కేంద్రాలుగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కేంద్రాల్లో విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు రాయడానికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఎండాకాలం...