గ్రామాల్లో పర్యటించి సమస్యలు పరిష్కరించాలి : కలెక్టర్ చంద్రశేఖర్ ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణపై సమీక్ష
నల్లగొండ బ్యూరో, డైనమిక్ న్యూస్, మార్చి 13 నూతన ప్రజాప్రతినిధులు గ్రామాల్లో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ పిలుపునిచ్చారు.ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ అమలులో భాగంగా శుక్రవారం మిర్యాలగూడలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 10 ప్రధాన అంశాలపై కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజులపాటు నిర్వహించాల్సిన కార్యక్రమాలను షెడ్యూల్ ప్రకారం రూపొందించి పది ప్రధాన అంశాలను తీసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రజలకు ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన కల్పించడం, సమస్యలను గుర్తించి పరిష్కరించడం ఈ...