ఐటీఐలో 6 స్వల్పకాలిక కోర్సుల ప్రారంభం

నల్లగొండ బ్యూరో, డైనమిక్ న్యూస్, మార్చి 9 నల్గొండలోని ప్రభుత్వ బాలికల ఐటీఐ/ఐటీసీలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆరు స్వల్పకాలిక నైపుణ్యాభివృద్ధి కోర్సులను నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల కార్యాచరణ – ప్రజాపాలన & ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ కోర్సులు ప్రారంభించబడినట్లు తెలిపారు. యువత నైపుణ్యాలను పెంపొందించుకోవాలి ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, యువత స్వయం ఉపాధి కోర్సులను సద్వినియోగం చేసుకుని తమకు తామే ఉపాధి అవకాశాలను సృష్టించుకోవాలని సూచించారు. పోటీ ప్రపంచంలో విద్యతో పాటు నైపుణ్యాలు కూడా చాలా అవసరమని పేర్కొన్నారు. ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యం...