పోలీస్ స్టేషన్‌లో శ్రమదానంపరిశుభ్రతపై పోలీసుల సామాజిక చైతన్యం

డైనమిక్ న్యూస్, టేక్మాల్, మార్చి 7 మెదక్ జిల్లా టేక్మాల్ మండల పోలీస్ స్టేషన్‌లో శనివారం పోలీస్ సిబ్బంది శ్రమదానం కార్యక్రమాన్ని నిర్వహించి పరిసరాలను శుభ్రం చేశారు. విధి నిర్వహణలో బిజీగా ఉన్నప్పటికీ సామాజిక బాధ్యతగా స్టేషన్ ఆవరణను పరిశుభ్రంగా ఉంచేందుకు ముందుకొచ్చారు. పరిసరాల శుభ్రతకు ప్రాధాన్యం స్టేషన్ ప్రాంగణంలో పెరిగిన పిచ్చి మొక్కలు, చెత్తాచెదారాన్ని తొలగించి పరిశుభ్రతను కాపాడారు. కార్యాలయ పరిసరాలు శుభ్రంగా ఉంటే ప్రజలకు కూడా ఆహ్లాదకర వాతావరణం ఏర్పడుతుందని పోలీసులు తెలిపారు. సమాజానికి ఆదర్శంగా పోలీసులు ప్రజలకు రక్షణ కల్పించడమే కాకుండా సమాజానికి ఆదర్శంగా నిలవడం తమ బాధ్యత అని పోలీసులు పేర్కొన్నారు. ఆరోగ్యకరమైన వాతావరణంలో విధులు నిర్వహించడం వల్ల మానసిక...