వెలగని స్ట్రీట్ లైట్లు… ప్రజలకు ఇబ్బందులుహైవేపై ప్రమాదాల భయం పెరుగుతోంది
డైనమిక్ న్యూస్, మోతే, మార్చి 7 మోతే మండలం రాఘవపురం ఎక్స్ రోడ్డు పరిధిలోని ఎన్‌హెచ్–365 బీబీ హైవేపై స్ట్రీట్ లైట్లు గత మూడు రోజులుగా వెలగకపోవడంతో వాహనదారులు, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి వేళల్లో హైవేపై పూర్తిగా చీకటి నెలకొనడంతో ప్రమాదాల ముప్పు పెరుగుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చీకటిలో ప్రయాణం స్ట్రీట్ లైట్లు పనిచేయకపోవడంతో రాత్రి సమయంలో వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాల్సి వస్తోంది. ముఖ్యంగా ఈ మార్గంలో తరచూ వాహన రాకపోకలు ఉండటంతో చీకటి కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. స్పందించని అధికారులు ఈ సమస్యపై సంబంధిత అధికారులను పలుమార్లు సంప్రదించినప్పటికీ సరైన స్పందన...