లక్ష్యాలను నూటికి నూరు శాతం సాధించాలి: కలెక్టర్ బి. చంద్రశేఖర్
నల్లగొండ బ్యూరో, డైనమిక్ న్యూస్, మార్చి 2 ఈ ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో అన్ని శాఖలు నిర్దేశించిన లక్ష్యాలను నూటికి నూరు శాతం సాధించేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అధికారులకు సూచించారు.సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన జిల్లా అధికారులతో కలిసి ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజావాణి ఫిర్యాదులు వెంటనే పరిష్కరించాలి ప్రజావాణి ద్వారా అందిన ఫిర్యాదులను పెండింగ్‌లో పెట్టకుండా వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను కూడా సమయానుసారంగా పరిష్కరించాలని చెప్పారు.హాస్టళ్ల తనిఖీలపై నిర్దేశిత ప్రొఫార్మాలో మండలాల ప్రత్యేక అధికారులు నివేదికలు సమర్పించాలని సూచించారు. బడ్జెట్ వృథా కాకుండా పనులు పూర్తి...