ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి వేడుకలు ఘనంగా జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ నివాళులు

సూర్యాపేట బ్యూరో, డైనమిక్ న్యూస్, మార్చి 2 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి సందర్భంగా జిల్లా యువజన & క్రీడాశాఖ ఆధ్వర్యంలో సోమవారం సూర్యాపేట కలెక్టరేట్‌లో ఘన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రజాస్వామ్య విలువలకు వన్నె తెచ్చిన నాయకుడు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, శాసనసభ స్పీకర్ పదవికి వన్నె తెచ్చిన మహనీయుడు దుద్దిళ్ల శ్రీపాదరావు అని అభివర్ణించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్‌గా ఆయన ప్రజాస్వామ్య విలువలను కాపాడడంలో విశిష్ట పాత్ర పోషించారని తెలిపారు. ప్రభుత్వం అధికారికంగా ఆయన జయంతిని...