సహజసిద్ధమైన రంగులతో హోళీ జరుపుకోవాలి: జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ప్రశాంత వాతావరణంలో హోళీ వేడుకలు నిర్వహించాలి
నల్లగొండ బ్యూరో, డైనమిక్ న్యూస్, మార్చి 2 నల్లగొండ జిల్లాలో రేపు నిర్వహించుకోనున్న హోళీ పండుగ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ముందుగా శుభాకాంక్షలు తెలిపారు. హోళీ వేడుకలను సాంప్రదాయబద్ధంగా, పరస్పర గౌరవంతో, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని ప్రజలను కోరారు. హానికర రసాయనిక రంగులకు దూరంగా ఉండాలి హోళీ సందర్భంగా సహజసిద్ధమైన రంగులను మాత్రమే వినియోగించాలని, రసాయనిక రంగులను వాడకూడదని సూచించారు. ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా బలవంతంగా రంగులు చల్లడం, నీటి బెలూన్లు విసరడం వంటి చర్యలకు పాల్పడవద్దని హెచ్చరించారు. ప్రార్థనా మందిరాలు, ప్రజా ప్రదేశాలు, రహదారులపై వాహనదారులకు ఆటంకం కలిగించకుండా బాధ్యతాయుతంగా...