హోలీ వేడుకలు సురక్షితంగా జరుపుకోవాలి: ఎస్పీ నరసింహ ప్రమాదాలకు దూరంగా ఉండాలి – ఇతరులకు ఇబ్బంది కలిగించవద్దు ఇష్టపడని వారిపై రంగులు చల్లొద్దు – రహదారులపై క్రమశిక్షణ పాటించాలి
సూర్యాపేట బ్యూరో, డైనమిక్ న్యూస్, మార్చి 1 హోలీ పండుగను సంతోషకర వాతావరణంలో, కలిసిమెలిసి, శాంతియుతంగా జరుపుకోవాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ విజ్ఞప్తి చేశారు. హోలీ సందర్భంగా ప్రజలు ప్రమాదాలకు దూరంగా ఉండాలని, ఇతరులకు ఇబ్బందులు కలిగించే విధంగా ప్రవర్తించవద్దని సూచించారు.రంగులు చల్లుకునే సమయంలో పరిసరాలను గమనించాలని, ఇష్టపడని వ్యక్తులపై బలవంతంగా రంగులు చల్లరాదని స్పష్టం చేశారు. రహదారులపై క్రమశిక్షణతో వ్యవహరించాల్సిందిగా కోరారు. మద్యం సేవించి వాహనాలు నడపొద్దు బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించరాదని, మద్యం మత్తులో వాహనాలు నడపకూడదని హెచ్చరించారు. హోలీ ఉత్సవం విషాదంగా మారకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని సూచించారు. సంప్రదాయ రంగులకు ప్రాధాన్యం రసాయన రంగులు ఆరోగ్యానికి హానికరమని,...