రైతు భరోసా తేదీలపై స్పష్టత ఇవ్వాలి: సిపిఐ డిమాండ్– రాష్ట్ర కమిటీ సభ్యుడు ధూళిపాళ ధనుంజయ నాయుడు విజ్ఞప్తి

నేరేడుచర్ల, మార్చి 1, డైనమిక్ న్యూస్ రైతు భరోసా నిధుల విడుదలపై ప్రభుత్వం స్పష్టమైన తేదీలను ప్రకటించాలని సిపిఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు ధూళిపాళ ధనుంజయ నాయుడు డిమాండ్ చేశారు. మున్సిపల్ ఎన్నికల అనంతరం రైతు భరోసా అందజేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు నిధులు జమ కాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. క్యాబినెట్ సమావేశంపై అసంతృప్తి ఆదివారం సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండల కేంద్రంలో మండల సిపిఐ కార్యదర్శి కత్తి శ్రీనివాసరెడ్డి, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు చిలకరాజు శ్రీను, పట్టణ అధ్యక్షుడు పరికె భరత్‌లతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటీవల జరిగిన క్యాబినెట్ సమావేశంలో రైతు భరోసాపై స్పష్టమైన ప్రకటన వెలువడుతుందనే...