సూర్యాపేట పట్టణంలో డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య శిబిరం అరైవ్ అలైవ్’ మహా ఉద్యమం భాగంగా పోలీసుల సామాజిక సేవ
సూర్యాపేట బ్యూరో, డైనమిక్ న్యూస్ ఫిబ్రవరి 28 రోడ్డు ప్రమాదాల నివారణే ప్రధాన లక్ష్యంగా రాష్ట్ర పోలీసు శాఖ చేపట్టిన ‘అరైవ్ అలైవ్’ మహా ఉద్యమం 2వ విడత కార్యక్రమంలో భాగంగా సూర్యాపేట పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో శనివారం డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. పట్టణంలోని రవి ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని జిల్లా ఎస్పీ కె. నరసింహ ప్రారంభించారు. దేశంలో రోడ్డు ప్రమాదాలు ఆందోళనకరం ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా రోజుకు సగటున 3,500 మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. భారతదేశంలో ప్రతి సంవత్సరం సుమారు 1.5 లక్షల మంది, తెలంగాణ రాష్ట్రంలో సుమారు...