పౌర హక్కుల దినోత్సవం: వైకుంఠాపురంలో సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శిబిరం బడుగు బలహీన వర్గాల హక్కుల పరిరక్షణకు అధికారుల హామీ
నేరేడుచర్ల, డైనమిక్ న్యూస్, ఫిబ్రవరి 28 నేరేడు చర్ల మండల పరిధిలోని వైకుంఠాపురం గ్రామంలో పౌర హక్కుల దినోత్సవం సందర్భంగా శనివారం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. బడుగు, బలహీన వర్గాల హక్కులకు భంగం కలగకుండా చూడటమే లక్ష్యంగా ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. గ్రామ ప్రజల సమస్యలను వారి వద్దకే వెళ్లి తెలుసుకుని, తక్షణ పరిష్కారం చూపే దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. ప్రజల సమస్యలపై ప్రత్యక్ష అవగాహన ఈ సందర్భంగా గ్రామంలోని వివిధ వర్గాల ప్రజలతో అధికారులు ముఖాముఖి సమావేశమయ్యారు. పింఛన్లు, రేషన్, భూమి సంబంధిత అంశాలు, హాస్టల్ మరియు అంగన్‌వాడి సేవలపై వచ్చిన ఫిర్యాదులను స్వీకరించి, సంబంధిత శాఖలకు దిశానిర్దేశం చేశారు. సమస్యలను...