తుమ్మగూడెంలో బీఆర్ఎస్‌కు భారీ షాక్కాంగ్రెస్‌లోకి 8వ వార్డు సభ్యుడు సమ్మయ్య అనుచరులతో చేరిక

డైనమిక్ న్యూస్, మోతే, ఫిబ్రవరి 26 మోతే మండలం తుమ్మగూడెం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. గ్రామపంచాయతీ 8వ వార్డు సభ్యుడు ఆవులదొడ్డి సమ్మయ్య తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే సమక్షంలో చేరిక స్థానిక ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి సమక్షంలో సమ్మయ్యకు పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు గ్రామంలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. పలువురు నాయకుల హాజరు ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నాయకుడు రామాచారి, గ్రామ శాఖ అధ్యక్షుడు నల్లు కరుణాకర్ రెడ్డి, మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు మాదగాని సత్యనారాయణ గౌడ్, దుంపటి శ్రీరాములు,...