ఇంటర్ పరీక్ష కేంద్రాలపై కలెక్టర్ ఆకస్మిక తనిఖీ సౌకర్యాల్లో రాజీ పడొద్దు – అధికారులకు ఆదేశం మాల్ ప్రాక్టీస్‌కు తావులేదు
నల్లగొండ బ్యూరో, డైనమిక్ న్యూస్, ఫిబ్రవరి 25 జిల్లాలో బుధవారం నుంచి ప్రారంభమైన ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని సందర్శించి విద్యార్థుల హాజరు, కేంద్రంలో ఉన్న సౌకర్యాలపై సమగ్రంగా పరిశీలించారు.జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి దశ్రు నాయక్‌ను ప్రశ్నిస్తూ హాజరు వివరాలు, ప్రశ్నపత్రాలు–ఆన్సర్ షీట్ల భద్రత, క్లాక్ రూమ్ ఏర్పాట్లు, తాగునీరు, టాయిలెట్ సౌకర్యాలు వంటి అంశాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు వెంట తీసుకువచ్చిన పుస్తకాలు, మొబైల్ ఫోన్లు, వాచ్‌లు తదితర ఎలక్ట్రానిక్ వస్తువులను భద్రపరచేందుకు ప్రతి...