హుజూర్నగర్‌లో 2,160 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వేగవంతం మార్చి మొదటి వారంలో సీఎం చేతుల మీదుగా ప్రారంభోత్సవం

హుజూర్ నగర్, డైనమిక్ న్యూస్, ఫిబ్రవరి 24 రాష్ట్ర చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఒకే చోట 2,160 ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి పేదలకు అందిస్తున్నామని రాష్ట్ర పౌరసరఫరాలు మరియు నీటిపారుదల శాఖ మంత్రి నలమాధ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మంగళవారం హుజూర్నగర్‌లోని రామస్వామి గుట్ట వద్ద 110 ఎకరాలలో రూ.125 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఎండి గౌతమ్, జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ పాల్గొన్నారు. 14 ఏళ్ల పట్టుదల ఫలితం అనంతరం మంత్రి క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, 2011లో గృహ నిర్మాణ...