ఆప్షన్–3 ఇళ్లు పూర్తి చేయని కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు బ్లాక్‌లిస్ట్ చేయాలని అధికారులకు ఆదేశాలు – జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా

నరసరావుపేట, డైనమిక్ న్యూస్, ఫిబ్రవరి 23 పేదలకు మంజూరైన గృహాల నిర్మాణంలో నిర్లక్ష్యం ప్రదర్శించిన కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా అధికారులను ఆదేశించారు. ఆప్షన్–3 విధానంలో ఇళ్ల నిర్మాణాలను మధ్యలోనే వదిలేసిన కాంట్రాక్టర్లపై కేసులు నమోదు చేసి, భవిష్యత్తులో ప్రభుత్వ పనుల్లో పాల్గొనకుండా బ్లాక్‌లిస్ట్ చేయాలని స్పష్టం చేశారు. ఎస్సార్ శంకరన్ హాలులో సమీక్ష సమావేశం సోమవారం మధ్యాహ్నం నరసరావుపేట కలెక్టరేట్‌లోని ఎస్సార్ శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో గృహ నిర్మాణాల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న ఇళ్ల వివరాలు, నిర్మాణాల స్థితి, లబ్ధిదారులకు ఎదురవుతున్న సమస్యలపై అధికారులతో చర్చించారు. రిజిస్ట్రేషన్ లేని స్థలాలపై సర్వే గ్రామాల్లో...