సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో డ్రగ్స్ వ్యతిరేక అవగాహన సదస్సు డ్రగ్స్ వద్దు – చదువు ముద్దు నినాదంతో కార్యక్రమం

కారంపూడి, ఫిబ్రవరి 23 డైనమిక్ న్యూస్ పల్నాడు జిల్లా కారంపూడి పట్టణంలోని Saint John's English Medium High Schoolలో విద్యార్థులకు డ్రగ్స్‌పై అవగాహన కల్పిస్తూ ప్రత్యేక సదస్సు నిర్వహించారు. జిల్లా ఎస్పీ బి.వి. కృష్ణారావు ఆదేశాల మేరకు సిఐ శరత్ బాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం సోమవారం జరిగింది. ఈగల్ టీమ్ టాస్క్ ఫోర్స్‌తో ప్రత్యేక చర్యలు రాష్ట్ర ప్రభుత్వం గంజాయి, డ్రగ్స్ నిర్మూలనకు ప్రత్యేకంగా ఈగల్ టీమ్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసినట్లు సిఐ తెలిపారు. పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తూ విద్యార్థులను మత్తు పదార్థాల దుష్పరిణామాలపై చైతన్యపరుస్తున్నట్లు చెప్పారు. మత్తు పదార్థాల అమ్మకాలపై కఠిన చర్యలు గంజాయి, తంబాకు, నిషేధిత...