చిల్లేపల్లి 2 మేజర్ కాలువలో నిర్వీర్యమైన వ్యవస్థ నీరు లేక వరి పంటలు ఎండిపోతే చూస్తున్న యన్‌ఎస్‌పీ అధికారులు!
నేరేడుచర్ల, డైనమిక్ న్యూస్, ఫిబ్రవరి 22 నేరేడు చర్ల మండలం పరిధిలోని చిల్లేపల్లి 2 మేజర్ కాలువ నుంచి వచ్చే ఉపకాలువ ద్వారా శాంతినగర్ మున్సిపాలిటీ చివరి భూములకు సాగునీరు పూర్తిగా నిలిచిపోయింది. కాలువలో నీటి ప్రవాహం లేకపోవడంతో ఇప్పటికే సాగు చేసిన వరి పంటలు ఎండిపోతూ రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్న, మధ్యతరగతి రైతుల పొలాల్లో పచ్చదనం మాయమై నేర్రెలు పడిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. కాలువల్లో నాచు – నీటి ప్రవాహానికి తాళం వేసిన నిర్లక్ష్యం చిల్లేపల్లి 2 మేజర్ కాలువలో నాచు విపరీతంగా పెరిగి నీటి ప్రవాహాన్ని పూర్తిగా అడ్డుకుంది. నెలల తరబడి శుభ్రపరిచే పనులు చేపట్టకపోవడం యన్‌ఎస్‌పీ అధికారుల...