జిల్లాలో మోడల్ అంగన్వాడీ కేంద్రాలు ఏర్పాటు చేయాలి పోషకాహార లోపం ఉన్న పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్ ఆదేశాలు
సూర్యాపేట బ్యూరో, డైనమిక్ న్యూస్, ఫిబ్రవరి 17 జిల్లాలో మోడల్ అంగన్వాడీ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మహిళా, శిశు, దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. పోషణ స్థితిపై క్రమానుసార పర్యవేక్షణ అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల ఎత్తు, బరువు వివరాలను క్రమం తప్పకుండా నమోదు చేసి, పోషకాహార లోపం ఉన్న పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు. ‘పోషణ ట్రాకర్’ ద్వారా సేవలను సమర్థవంతంగా పర్యవేక్షించాలని ఆదేశించారు. నూతన ప్రీ-స్కూల్ సిలబస్ అమలు అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు నూతన ప్రీ-స్కూల్...