రషీద్ కుటుంబానికి అండగా ఉంటాం రషీద్ తల్లిని ఫోన్‌లో పరామర్శించిన మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
డైనమిక్ న్యూస్, వినుకొండ, ఫిబ్రవరి 17 వైసీపీ, మాజీ ఎమ్మెల్యే బొల్లా తోడుంటారని భరోసా పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలో నడిరోడ్డుపై దారుణ హత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోన్ ద్వారా పరామర్శించారు. ఈ ఘటనపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వరుస విషాదాలు వినుకొండలో జరిగిన దారుణ ఘటనలో రషీద్ హత్యకు గురవగా, ఆ సంఘటనను తట్టుకోలేక అతని తండ్రి షేక్ ఫరీసా ఆరోగ్యం క్షీణించి ఇటీవల మృతి చెందారు. కొడుకు కళ్లముందే హత్యకు గురికావడం, ఆ బాధతో తండ్రి మరణించడం కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. ధైర్యం...