విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి సీఎం కప్పు విజేతలకు బహుమతులు అందజేసిన జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

సూర్యాపేట బ్యూరో, డైనమిక్ న్యూస్, ఫిబ్రవరి 16 విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో కూడా ప్రతిభ కనబర్చాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సూచించారు. సోమవారం స్థానిక జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించిన జిల్లాస్థాయి జూనియర్, సీనియర్ విభాగాల సీఎం కప్పు క్రీడా పోటీల్లో విజేతలైన విద్యార్థులకు ఆయన బహుమతులు ప్రదానం చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడటమే కాకుండా క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. పాఠశాల, కళాశాల స్థాయిలోనే విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని ఆకాంక్షించారు. ఈ నెల 20వ తేదీ నుండి హైదరాబాద్‌లో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో సూర్యాపేట జిల్లా విద్యార్థులు ప్రతిభ కనబర్చి...