నేరేడుచర్ల మున్సిపాలిటీలో ఏకగ్రీవ ఎన్నికలు ఛైర్మన్‌గా కొణతం చిన్న వెంకట్ రెడ్డి, వైస్ ఛైర్మన్‌గా నూకల సందీప్ కుమార్ రెడ్డి

నేరేడు చర్ల, డైనమిక్ న్యూస్, ఫైబ్రవరి 16 సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీలో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించబడి ఏకగ్రీవంగా పూర్తయ్యాయి. స్థానిక ప్రజాప్రతినిధుల సమన్వయం, పరస్పర అవగాహనతో ఈ ఎన్నికలు ఎలాంటి పోటీ లేకుండా ముగియడం విశేషంగా నిలిచింది. ఛైర్మన్‌గా కొణతం చిన్న వెంకట్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక మున్సిపల్ ఛైర్మన్ పదవికి15 వ వార్డు కౌన్సిలర్ కొణతం చిన్న వెంకట్ రెడ్డి పేరును నూకల సందీప్ కుమార్ రెడ్డి ప్రతిపాదించగా, 12వ వార్డు కౌన్సిలర్ అబ్దుల్ కలీల్ మహ్మద్ బలపరిచారు. ఇతర సభ్యుల మద్దతుతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. కొణతం చిన్న వెంకట్ రెడ్డి...