మహాశివరాత్రి వేళ పానగల్ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పట్టు వస్త్రాల సమర్పణ
నల్లగొండ బ్యూరో, డైనమిక్ న్యూస్,ఫిబ్రవరి 15 మహాశివరాత్రి సందర్భంగా నల్లగొండ పట్టణంలోని చారిత్రాత్మక పానగల్ పచ్చల సోమేశ్వరాలయం మరియు ఛాయా సోమేశ్వరాలయం దేవాలయాల్లో రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయాల్లో అర్చకుల చేతుల మీదుగా అభిషేకాలు, అర్చనలు జరిపించి పట్టు వస్త్రాలు సమర్పించారు. చారిత్రాత్మక కట్టడాల అభివృద్ధికి కట్టుబాటు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ దేవాలయాలు తెలంగాణకు గర్వకారణమని పేర్కొన్నారు. 11-12వ శతాబ్దాలకు చెందిన ఈ ఆలయాల్లో అద్భుత శిల్పకళ ఉట్టిపడుతుందని తెలిపారు. పానగల్ దేవాలయాలను పర్యాటకంగా మరింత అభివృద్ధి చేసి దేశ విదేశాల...