నేరేడుచర్ల మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఆధిక్యంచైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ – బీఆర్‌ఎస్-జనసేనకు 6 సీట్లు

నేరేడుచర్ల, డైనమిక్ న్యూస్,ఫిబ్రవరి 13 నేరేడుచర్ల మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యం సాధించింది. మొత్తం 15 వార్డులలో కాంగ్రెస్ 9 స్థానాలు గెలుచుకుని మెజార్టీ దక్కించుకోగా, బీఆర్‌ఎస్ పార్టీ 5 వార్డుల్లో విజయం సాధించింది. జనసేన పార్టీతో పొత్తులో మరో ఒక వార్డు గెలవడంతో బీఆర్‌ఎస్–జనసేన కూటమి మొత్తం 6 స్థానాలను కైవసం చేసుకుంది. త్రిముఖ పోటీ – చివరికి ద్విముఖ సమరం ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్య త్రిముఖ పోటీ నెలకొన్నప్పటికీ, ప్రధాన పోటీ మాత్రం కాంగ్రెస్ మరియు బీఆర్‌ఎస్ మధ్యే సాగింది. బీజేపీ పార్టీ ఒక్క వార్డులో కూడా విజయం సాధించలేకపోవడం విశేషం. చైర్మన్ పదవిపై...