సూర్యాపేటలో 13న పురపాలక ఓట్ల లెక్కింపు పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహణకు పూర్తి ఏర్పాట్లు
సూర్యాపేట బ్యూరో, డైనమిక్ న్యూస్ ఫిబ్రవరి 12 పురపాలక సంస్థల ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఈ నెల 13వ తేదీన పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. గురువారం సమీకృత కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, కౌంటింగ్ సూపర్‌వైజర్లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కౌంటింగ్ ప్రక్రియపై సమగ్ర అవగాహన ఈ సందర్భంగా ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో అనుసరించాల్సిన ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, టేబుల్‌వైజ్ కౌంటింగ్ విధానం, బ్యాలెట్ పత్రాల వర్గీకరణ, పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు విధానం తదితర అంశాలపై...