సూర్యాపేట జిల్లాలో మున్సిపల్ ఓట్ల లెక్కింపుకు కట్టుదిట్టమైన బందోబస్తు 350 మంది పోలీసులతో మూడంచెల భద్రతా ఏర్పాట్లు – 163 BNSS నిషేధాజ్ఞలు అమలు
సూర్యాపేటబ్యూరో, ఫిబ్రవరి 12, డైనమిక్ న్యూస్ మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా సూర్యాపేట జిల్లాలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ కె. నరసింహ తెలిపారు. ఓట్ల లెక్కింపు కేంద్రం అయిన శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాల వద్ద 350 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. 163 BNSS (144 సెక్షన్) అమలు ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా 163 BNSS (144 సెక్షన్) నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని ఎస్పీ పేర్కొన్నారు. ఈ నిషేధాజ్ఞలు శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి శనివారం ఉదయం 6 గంటల వరకు అమల్లో ఉంటాయని తెలిపారు.లెక్కింపు కేంద్రంలోకి...