మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ప్రారంభం ఉదయం 9 గంటల వరకు 11.20% పోలింగ్ నమోదు

నల్లగొండ బ్యూరో, డైనమిక్ న్యూస్, ఫిబ్రవరి 11 నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు జిల్లాలోని ఆరు మున్సిపాలిటీలలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బి. చంద్రశేఖర్ తెలిపారు. బుధవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. పోలింగ్ కేంద్రాల పరిశీలన పోలింగ్ ప్రారంభమైన వెంటనే కలెక్టర్ నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎస్‌ఆర్ గార్డెన్ సమీపంలోని ఉర్దూ మీడియం పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ఓటర్లకు కల్పించిన సౌకర్యాలు, పోలింగ్ ప్రక్రియను పరిశీలించారు. అన్ని గదుల నుంచి వెబ్‌కాస్టింగ్ ఉండేలా చూడాలని, పోలింగ్ కేంద్రాల వద్ద మెడికల్ టీంలను...