నేరేడు చర్ల మున్సిపల్ ఎన్నికల్లో భద్రతా ఏర్పాట్లకు పోలీసుల పటిష్ట చర్యలు శాంతియుత, నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణే లక్ష్యంగా పోలీస్ కవాతు

నేరేడుచర్ల, డైనమిక్ న్యూస్, ఫిబ్రవరి 6 నేరేడు చర్ల మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పట్టణంలో భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూ పోలీసులు కఠిన చర్యలకు శ్రీకారం చుట్టారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా, ప్రజలు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు చేపడుతున్నామని పోలీసు అధికారులు స్పష్టం చేశారు.శుక్రవారం నేరేడు చర్ల మున్సిపాల్టీ పరిధిలో భారీ సంఖ్యలో పోలీస్ సిబ్బందితో కవాతు నిర్వహించి, ప్రజలకు భద్రతపై భరోసా కల్పించారు. సీనియర్ అధికారుల ఆధ్వర్యంలో కవాతు హుజూర్ నగర్ సీఐ చరమంద రాజు, స్థానిక ఎస్‌ఐ రవీందర్, గరిడేపల్లి ఎస్‌ఐ నరేష్, పాలకవీడు ఎస్‌ఐ కొటేష్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది...