నేరేడుచర్లలో క్లీన్ స్వీప్ లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహం15కి 15 గెలుపే నిజమైన విజయం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
నేరేడుచర్ల, ఫిబ్రవరి 5, డైనమిక్ న్యూస్ నేరేడుచర్ల మున్సిపల్ ఎన్నికల్లో 15 వార్డులకు గాను 15 స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటేనే దానిని నిజమైన గెలుపుగా భావించాల్సి ఉంటుందని రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం ఆకస్మికంగా నేరేడు చర్ల కాంగ్రెస్ పార్టీ నాయకులతో సమావేశమై మాట్లాడారు కేవలం 10 వార్డులు గెలిచి మున్సిపల్ పాలకవర్గాన్ని ఏర్పాటు చేయడం పెద్ద విషయం కాదని, అది సంపూర్ణ విజయం కాదని వ్యాఖ్యానించారు. ప్రజల సంపూర్ణ మద్దతు ప్రతిబింబించేలా అన్ని వార్డుల్లో కాంగ్రెస్ గెలవాలని ఆయన పిలుపునిచ్చారు. క్లీన్ స్వీప్ే లక్ష్యం హుజూర్‌నగర్‌లో 28 వార్డులు, కోదాడలో 35 వార్డులు, నేరేడుచర్లలో 15...