ఎస్సీ–ఎస్టీ విజిలెన్స్ & మానిటరింగ్ కమిటీ సమావేశాలు వెంటనే ఏర్పాటు చేయాలి పల్నాడు జిల్లా డివిఎంసి సభ్యుల వినతి సానుకూలంగా స్పందించిన రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్

నరసరావుపేట, ఫిబ్రవరి 5, డైనమిక్ న్యూస్ పల్నాడు జిల్లాలో ఎస్సీ–ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశాలను వెంటనే ఏర్పాటు చేయాలని కోరుతూ పల్నాడు జిల్లా ఎస్సీ–ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కొత్తపల్లి శామ్యూల్ జవహర్‌కు వినతిపత్రం అందజేశారు.బుధవారం నరసరావుపేట మున్సిపాలిటీ గెస్ట్ హౌస్‌లో జిల్లాకు వచ్చిన రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్‌ను కమిటీ సభ్యులు కలిసి పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. ఐదు నెలలుగా సమావేశాలు లేవు జిల్లాలో ఎస్సీ–ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీలు ఏర్పాటు చేసి సభ్యులుగా నియామక పత్రాలు అందించి ఐదు నెలలు గడుస్తున్నప్పటికీ ఇప్పటివరకు ఒక్క...