కారంపూడి ఎంపీపీ పదవి టీడీపీ ఖాతాలోకి ఏకగ్రీవంగా బొల్లినేడి కనకదుర్గ–శ్రీనివాసరావు ఎన్నిక
కారంపూడి, డైనమిక్ న్యూస్, ఫిబ్రవరి 4 కారంపూడి మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం ఎంపీపీ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. పల్నాడు జిల్లా ఇండస్ట్రీ ఎడి, ఎన్నికల అధికారి నవీన్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల్లో టీడీపీకి చెందిన వేపకంపల్లి ఎంపీటీసీ సభ్యులు బొల్లినేడి కనకదుర్గ, శ్రీనివాసరావు ఏకగ్రీవంగా ఎంపీపీగా ఎన్నికయ్యారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన ప్రక్రియ మధ్యాహ్నం 12 గంటలకు పటిష్ట పోలీసు బందోబస్తు మధ్య ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. కూటమి నాయకులు, శ్రేణులు పెద్ద ఎత్తున హాజరై బొల్లినేడి కనకదుర్గ, శ్రీనివాసరావు నామినేషన్లు దాఖలు చేయించారు. ఇతర నామినేషన్లు లేకపోవడంతో ఏకగ్రీవం నిర్దేశిత గడువు ముగిసే వరకు మరే ఇతర అభ్యర్థులు...