శ్రీ వెంకటేశ్వర విద్యానిలయం 33వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహణ మోతే మండలం మామిళ్లగూడెం గ్రామంలో వేడుకలు

మోతే ,డైనమిక్ న్యూస్ , ఫిబ్రవరి 4 సూర్యాపేట జిల్లా మోతే మండలంలోని మామిళ్లగూడెం గ్రామంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర విద్యానిలయం తన 33వ వార్షికోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించింది. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దల సమక్షంలో వేడుకలు ఉత్సాహంగా కొనసాగాయి. తల్లిదండ్రుల సహకారమే విజయానికి మూలం : ఎండి జానిమియా ఈ సందర్భంగా విద్యాసంస్థ అధిపతి ఎండి జానిమియా మాట్లాడుతూ, గత 33 సంవత్సరాలుగా తమ విద్యాసంస్థను విజయవంతంగా నడుపుతున్నామంటే అందుకు ప్రధాన కారణం విద్యార్థుల తల్లిదండ్రుల సహకారమేనని అన్నారు. పాఠశాల అభివృద్ధికి తోడ్పడిన అన్ని సామాజిక వర్గాల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. పేద విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన విద్య ఇన్ని సంవత్సరాల...