జానలదిన్నలో పశుసంవర్ధక శాఖ అవగాహన–వైద్య శిబిరం పాడి పరిశ్రమ అభివృద్ధే లక్ష్యంగా ప్రత్యేక క్యాంపు గేదెల్లో గర్భకోశ వ్యాధుల నివారణపై రైతులకు అవగాహన
డైనమిక్ న్యూస్, నేరేడు చర్ల, ఫిబ్రవరి 3 నేరేడు చర్ల మండల పరిధిలోని జానలదిన్న గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పాడి పరిశ్రమ అభివృద్ధి, పాల ఉత్పత్తి పెంపు, పశువుల ఆరోగ్య సంరక్షణ లక్ష్యంగా అవగాహనతో కూడిన వైద్య శిబిరం నిర్వహించారు. మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమంలో మండల పశువైద్యాధికారి డా. జె. నరేష్ , డాక్టర్ రవి నాయక్ పాల్గొని రైతులకు విలువైన సూచనలు చేశారు. పాడి పరిశ్రమ ద్వారా ఆదాయం పెంచుకోవచ్చు ఈ సందర్భంగా డా. నరేష్ మాట్లాడుతూ, గ్రామీణ రైతులకు పాడి పరిశ్రమ స్థిర ఆదాయ వనరుగా మారుతుందని పేర్కొన్నారు. గేదెలు, ఆవుల సంరక్షణలో సరైన పోషకాహారం,...