నేరేడుచర్ల పీఏసీఎస్‌ను సందర్శించిన జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి యూరియా కొరత లేదని స్పష్టం – అవసరం ఉన్న రైతులు మాత్రమే ఆన్లైన్ నమోదు చేసుకోవాలి
డైనమిక్ న్యూస్, నేరేడుచర్ల , ఫిబ్రవరి 3 నేరేడుచర్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) కార్యాలయాన్ని జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా యూరియా నిల్వలు, పంపిణీ విధానం, ఆన్లైన్ నమోదు ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. ఆయనతో పాటు మండల వ్యవసాయ అధికారి జావేద్ పి ఏ సి ఎస్ సి ఈ ఓ శ్రీనివాస్ పాల్గొన్నారు. యూరియా నిల్వలపై పరిశీలన పీఏసీఎస్ గోదాంలో ఉన్న యూరియా నిల్వలను ప్రత్యక్షంగా పరిశీలించిన జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి, ప్రస్తుతం యూరియా సరిపడా స్థాయిలో అందుబాటులో ఉందని తెలిపారు. ఎలాంటి కొరత పరిస్థితి లేదని, రైతులు భయపడాల్సిన అవసరం...