స్టడీ సర్కిల్ ఉచిత కోచింగ్‌కు దరఖాస్తుల గడువు పొడిగింపు

డైనమిక్ న్యూస్, సూర్యాపేటబ్యూరో, ఫిబ్రవరి 2 తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులముల స్టడీ సర్కిల్, సూర్యాపేట బ్రాంచిలో వివిధ పోటీ పరీక్షలకు నిర్వహించనున్న 5 నెలల ఉచిత రెసిడెన్షియల్ ఫౌండేషన్ కోర్సు శిక్షణకు దరఖాస్తుల గడువును ఫిబ్రవరి 22, 2026 వరకు పొడిగించినట్లు జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి శాఖ అధికారి దయానంద రాణి తెలిపారు. అర్హతలు: SC, ST, BC మరియు మైనారిటీ వర్గాలకు చెందిన డిగ్రీ ఉత్తీర్ణులైన నిరుద్యోగ అభ్యర్థులు అర్హులు. తల్లిదండ్రుల/సంరక్షకుల వార్షిక ఆదాయం రూ.3 లక్షల లోపు ఉండాలి. శిక్షణ వివరాలు: రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, బ్యాంకింగ్, రైల్వే, SSC తదితర పరీక్షలకు సిద్ధమయ్యేందుకు 5 నెలల పాటు...