ఆపరేషన్ స్మైల్ ద్వారా నల్లగొండ జిల్లాలో రికార్డ్ స్థాయిలో బాల కార్మికుల విముక్తి ఒక్క నెలలోనే 92 కేసులు – 118 మంది బాలల రెస్క్యూ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆధ్వర్యంలో విజయవంతమైన ప్రత్యేక ఆపరేషన్
డైనమిక్ న్యూస్, నల్లగొండ బ్యూరో ,ఫిబ్రవరి 02 పలకా–బలపం పట్టి పాఠశాలల్లో చదవాల్సిన పసిబాల్యాన్ని వెట్టిచాకిరీ నుంచి విడిపించి, వారి భవిష్యత్తుకు వెలుగు నింపుతోంది నల్లగొండ జిల్లా పోలీస్ శాఖ.జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ నాయకత్వంలో చేపట్టిన ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం ద్వారా ఒక్క జనవరి నెలలోనే 92 కేసులు నమోదు చేసి 118 మంది బాల కార్మికులను రెస్క్యూ చేసి రికార్డు సృష్టించింది. కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు ప్రత్యేక చర్యలు కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర పోలీస్ శాఖ ప్రతీ ఆరు నెలలకోసారి ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాలను నిర్వహిస్తోంది.ఈ కార్యక్రమాల లక్ష్యం బాల కార్మికులు, వీధి బాలలు,...