నేరేడు చర్లలో కాంగ్రెస్ విజయం సాధిస్తే క్రీడలకు పెద్దపీట 15 వార్డులలో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపుతో ప్లే గ్రౌండ్, స్పోర్ట్స్ సదుపాయాలు ఏర్పాటు చేస్తాం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

డైనమిక్ న్యూస్, నేరేడు చర్ల, జనవరి 31 మున్సిపల్ ఎన్నికలను అభివృద్ధి దిశగా మలిచే బాధ్యత కాంగ్రెస్ పార్టీదేనని రాష్ట్ర నీటిపారుదల, సివిల్ సప్లయిస్ శాఖల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. నేరేడు చర్ల మున్సిపల్ పరిధిలో శనివారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాంగ్రెస్ గెలిస్తే క్రీడా వసతులకు ప్రాధాన్యం నేరేడు చర్ల మున్సిపల్ లోని 15 వార్డులలో 15 మంది కాంగ్రెస్ అభ్యర్థులను ప్రజలు గెలిపిస్తే, పట్టణంలో ఆధునిక ప్లే గ్రౌండ్, క్రీడా మైదానాలు, స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. యువతను క్రీడల వైపు ప్రోత్సహించడమే...