జిల్లా వ్యాప్తంగా యూరియా మాయమైందా?ఆన్లైన్‌లో స్టాక్ ‘నిల్’… అధికారుల మాటల్లో ‘సమృద్ధి’వ్యవసాయ శాఖ వైఫల్యంతో రైతుల నమ్మకానికి దెబ్బ
డైనమిక్ న్యూస్, సూర్యాపేట బ్యూరో ,జనవరి 31 రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆన్లైన్ యూరియా బుకింగ్ విధానం సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా పూర్తిగా విఫలమైందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలోని అనేక మండలాల్లో ఫర్టిలైజర్ దుకాణాల ఆన్లైన్ వ్యవస్థలో యూరియా స్టాక్ ‘నిల్’గా కనిపిస్తుండటంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.జిల్లా వ్యాప్తంగా వందలాది ఫర్టిలైజర్ షాపులు ఉన్నప్పటికీ, ఎక్కువ శాతం షాపుల్లో ఆన్లైన్‌లో ఒక్క బస్తా కూడా స్టాక్ చూపించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. కలెక్టర్ ప్రకటనలు – క్షేత్రస్థాయి వాస్తవాలు భిన్నం జిల్లా కలెక్టర్ జిల్లా వ్యాప్తంగా యూరియా బస్తాలు సమృద్ధిగా ఉన్నాయని ప్రకటనలు చేస్తుండగా, క్షేత్రస్థాయిలో మాత్రం రైతులకు యూరియా అందని పరిస్థితి...