నేరేడుచర్ల మండలంలో యూరియా మాయమైందా?ఆన్లైన్‌లో స్టాక్ ‘నిల్’… అధికారుల మాటల్లో ‘సమృద్ధి’రైతుల నమ్మకాన్ని దెబ్బతీస్తున్న వ్యవసాయ శాఖ వైఫల్యం

డైనమిక్ న్యూస్, నేరేడుచర్ల, జనవరి 31 రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆన్లైన్ యూరియా బుకింగ్ విధానం నేరేడుచర్ల మండలంలో పూర్తిగా విఫలమైందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మండల వ్యాప్తంగా సుమారు 30కి పైగా ఫర్టిలైజర్ దుకాణాలు ఉన్నప్పటికీ, ఒక్క షాపులో కూడా ఆన్లైన్ వ్యవస్థలో యూరియా బస్తాల స్టాక్ కనిపించడం లేదు. అన్ని చోట్లా ‘నిల్’ అని మాత్రమే చూపిస్తోంది. కలెక్టర్ మాటలు – క్షేత్రస్థాయి వాస్తవాలు వేర్వేరు జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్ జిల్లా వ్యాప్తంగా యూరియా బస్తాలు సమృద్ధిగా ఉన్నాయని ప్రకటనలు ఇస్తుంటే, మండలంలో మాత్రం రైతులకు ఒక్క బస్తా కూడా అందని పరిస్థితి నెలకొంది. అధికారుల ప్రకటనలకు,...