10వ వార్డు అభివృద్ధే లక్ష్యం : కాంగ్రెస్ అభ్యర్థి వెంకటి శేఖర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేసిన వెంకటి శేఖర్ రెడ్డిప్రజల ఆశీర్వాదంతో గెలిపించాలని విజ్ఞప్తి

డైనమిక్ న్యూస్, జనవరి 31, సూర్యాపేట సూర్యాపేట పట్టణంలోని 10వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న వెంకటి శేఖర్ రెడ్డి తనను ప్రజలు ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. శుక్రవారం నాడు ఆయన అధికారికంగా తన నామినేషన్ దాఖలు చేశారు.ఈ సందర్భంగా వెంకటి శేఖర్ రెడ్డి మాట్లాడుతూ, తాను కౌన్సిలర్‌గా ఎన్నికైతే వార్డు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎవరికి ఏ ఆపద వచ్చినా తన వంతు సహాయం అందిస్తానని స్పష్టం చేశారు.అలాగే 10వ వార్డును అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పనతో...