నేరేడు చర్లలో నామినేషన్ ప్రక్రియకు పటిష్ట భద్రత రెండవ రోజు నామినేషన్ కేంద్రాన్ని తనిఖీ చేసిన కోదాడ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి

నేరేడు చర్ల, డైనమిక్ న్యూస్, జనవరి 29 మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నేరేడు చర్ల పట్టణంలో నామినేషన్ స్వీకరణ ప్రక్రియ సజావుగా సాగేందుకు పోలీస్ శాఖ విస్తృత భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. రెండవ రోజు నామినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న సందర్భంగా గురువారం కోదాడ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి నామినేషన్ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎన్నికల నిర్వహణపై అధికారుల సమీక్ష ఈ తనిఖీలో మున్సిపల్ కమిషనర్ చెన్నబోయిన నాగరాజు, స్థానిక ఎస్‌ఐ రవీందర్‌లు డీఎస్పీకి తోడుగా పాల్గొన్నారు. నామినేషన్ స్వీకరణ జరుగుతున్న తీరును పరిశీలించిన అధికారులు, భద్రతా సిబ్బంది విధుల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. శాంతియుత వాతావరణం తప్పనిసరి ఎన్నికల ప్రక్రియ మొత్తం శాంతియుతంగా, పారదర్శకంగా...