పురాతన ఆలయాల పునరుద్ధరణే ప్రభుత్వ ప్రథమ లక్ష్యం పేరూరుపాడులో ఘనంగా శ్రీ నాగ మునీంద్ర స్వామి తిరుణాల మహోత్సవంఆలయ ఆధునికీకరణ పనులకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులుగ్రామాల్లో ఆధ్యాత్మిక చైతన్యం పెరగాలంటూ పిలుపు
డైనమిక్ న్యూస్,వినుకొండ, జనవరి 29 గ్రామీణ ప్రాంతాల్లో ఆధ్యాత్మిక భావజాలాన్ని బలోపేతం చేయడం ద్వారా సమాజంలో శాంతి, సౌహార్ద్రత, సౌభ్రాతృత్వం మరింత విస్తరిస్తాయని ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. వినుకొండ నియోజకవర్గం, బొల్లపల్లి మండలం పేరూరుపాడు గ్రామంలో గురువారం శ్రీ నాగ మునీంద్ర స్వామి తిరుణాల మహోత్సవం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన జీవీ ఆంజనేయులు ముందుగా ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులతో కలిసి స్వామివారి ఆశీస్సులు పొందారు. ఆలయ అభివృద్ధికి ప్రభుత్వ ప్రాధాన్యత ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో చేపట్టనున్న ఆధునికీకరణ, అభివృద్ధి పనులను జీవీ లాంఛనంగా...