పోస్టర్ల ఆవిష్కరణతో రోడ్డు భద్రతకు శ్రీకారంవిద్యార్థులే రోడ్ సేఫ్టీ అంబాసిడర్లు కావాలి – ఎస్పీ నరసింహ

డైనమిక్ న్యూస్, సూర్యాపేట బ్యూరో, జనవరి 29 రోడ్డు భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించడంపై ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె. నరసింహ పిలుపునిచ్చారు. రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాల్లో భాగంగా సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం ఎమ్మెస్సార్ పాఠశాల విద్యార్థులతో కలిసి హెల్మెట్ వినియోగం, సీట్ బెల్ట్ ధరించడం, అతివేగ నియంత్రణపై రూపొందించిన పోస్టర్లు, స్టిక్కర్లను ఎస్పీ ఆవిష్కరించారు. విద్యార్థుల ప్రయత్నం అభినందనీయం ప్రతి ఒక్కరూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలనే లక్ష్యంతో విద్యార్థులు చేపట్టిన అవగాహన కార్యక్రమం అభినందనీయమని ఎస్పీ కొనియాడారు. చిన్న వయస్సు నుంచే ట్రాఫిక్ నియమాలపై అవగాహన కలిగి ఉంటే...