మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రౌడీ షీటర్లకు కఠిన హెచ్చరికలు ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించిన నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి

డైనమిక్ న్యూస్, జనవరి 29, నల్గొండ బ్యూరో రానున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను శాంతియుతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పోలీసు శాఖ అన్ని చర్యలు తీసుకుంటుందని నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల నేపథ్యంలో నల్లగొండ పట్టణ పరిధిలోని రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్లు, సస్పెక్ట్ షీటర్లకు నల్గొండ డీఎస్పీ కార్యాలయంలో గురువారం ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించారు.ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ప్రవర్తిస్తే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి కచ్చితంగా పాటించాలి రౌడీ షీటర్లు ఎలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకూడదని, రాజకీయ పార్టీలకు అనుకూలంగా పనిచేయకూడదని సూచించారు....