కుక్కల సామూహిక హత్యలను అరికట్టడమే లక్ష్యం చిల్లేపల్లి గ్రామపంచాయతీలో అవగాహన సమావేశం

డైనమిక్ న్యూస్,, నేరేడు చర్ల, జనవరి 29 కుక్కలతో పాటు ఏ జంతువుపైనా హింస లేదా హత్య చట్టవిరుద్ధమని, ఇటువంటి చర్యలు నేరమని ప్రజలకు స్పష్టంగా తెలియజేసేందుకు చిల్లేపల్లి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో అవగాహన సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మరియు జిల్లా అధికారుల ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు డాక్టర్ నరేష్ తెలిపారు. చట్టపరమైన అవగాహన కల్పింపు ఈ సందర్భంగా డాక్టర్ నరేష్ మాట్లాడుతూ Animal Birth Control Rules, IPC సెక్షన్ 428, 429 ప్రకారం కుక్కలను, కోతులను లేదా ఏ జంతువునైనా హింసించడం, చంపడం శిక్షార్హ నేరమని వివరించారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. స్టెరిలైజేషన్ ద్వారానే...