రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభంనేరేడు చర్లలో నామినేషన్ కేంద్రం పరిశీలించిన అధికారులు
డైనమిక్ న్యూస్, నేరేడు చర్ల, జనవరి 28 రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ జారీ కావడంతో నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో నేరేడు చర్ల మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని మున్సిపల్ కమిషనర్ చెన్నబోయిన నాగరాజు, హుజూర్‌నగర్ సీఐ చారమంద రాజు, స్థానిక ఎస్‌ఐ రవీందర్ కలిసి పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లపై సమీక్ష నామినేషన్ కేంద్రం పరిసరాల్లో చేపట్టిన భద్రతా చర్యలు, పోలీసు బందోబస్తు ఏర్పాట్లు తదితర అంశాలను అధికారులు పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. ఎన్నికల నిబంధనల కచ్చిత అమలు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుపై...