నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు పోలీస్ శాఖ పటిష్ట ఏర్పాట్లు 100 మీటర్ల పరిధిలో నిషేధాజ్ఞలు – ఎన్నికల నియమావళి కచ్చిత అమలు
నల్లగొండ బ్యూరో, జనవరి 28, డైనమిక్ న్యూస్ నల్లగొండ జిల్లాలో జరగనున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు–2026ను పురస్కరించుకుని నల్లగొండ మున్సిపల్ కార్యాలయం సమీపంలో ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ బుధవారం పరిశీలించారు. నామినేషన్ ప్రక్రియ శాంతియుతంగా, పారదర్శకంగా సాగేందుకు తీసుకుంటున్న ఏర్పాట్లను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. ఏర్పాట్లపై సమగ్ర సమీక్ష నామినేషన్లు దాఖలు చేసే విధానం, అభ్యర్థుల ప్రవేశ–నిష్క్రమణ మార్గాలు, క్యూలైన్ల ఏర్పాటు, పోలీస్ బందోబస్త్, ట్రాఫిక్ నిర్వహణ వంటి అంశాలను జిల్లా ఎస్పీ పరిశీలించారు. అభ్యర్థులు, వారి ప్రతినిధులు, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నామినేషన్ ప్రక్రియ సజావుగా సాగాలని అధికారులకు సూచించారు. నిషేధాజ్ఞలు –...