ఎన్నికల నియమావళి పటిష్ట అమలు – ఎస్పి నరసింహనామినేషన్ కేంద్రాల పరిశీలన – బందోబస్తు ఏర్పాట్లపై సమీక్ష నామినేషన్ కేంద్రాల వద్ద గుంపులుగా చేరవద్దు – 144 సెక్షన్ అమల్లో ఉంది
సూర్యాపేట బ్యూరో, జనవరి 28, డైనమిక్ న్యూస్ మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేస్తామని జిల్లా ఎస్పి నరసింహ స్పష్టం చేశారు. సూర్యాపేట పట్టణ మున్సిపాలిటీ భవణంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను ఎస్పి స్వయంగా పరిశీలించి బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు. సీసీ కెమెరాల నిఘాలో నామినేషన్ ప్రక్రియ నామినేషన్ కేంద్రాలు పూర్తిగా సీసీ కెమెరాల నిఘాలో ఉన్నాయని తెలిపారు. అభ్యర్థులు మరియు వారి అనుచరులు నామినేషన్ కేంద్రాల వద్ద గుంపులుగా చేరకుండా సహకరించాలని సూచించారు. జిల్లాలో 144 సెక్షన్ అమలులో ఉందని, నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. చెక్ పోస్టులు – నిరంతర తనిఖీలు ఎన్నికల సమయంలో...